నా క్యారెక్టర్‌లో అనేక లేయర్స్ ఉంటాయి.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై శ్రీ గౌరి ప్రియ కామెంట్స్

by Chukka Sudharani |

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’.

నా క్యారెక్టర్‌లో అనేక లేయర్స్ ఉంటాయి.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై శ్రీ గౌరి ప్రియ కామెంట్స్
X

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తుండగా.. తాజాగా ఈ సినిమా గ్రాండ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ.. ‘మా మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఏడాది అవుతోంది. ఇప్పటివరకు కూడా మీరు ఆ గ్లింప్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి మీరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మరో వారం రోజుల్లో మా సినిమా రిలీజ్ కు వస్తోంది. ఇప్పుడు మీ సపోర్ట్ ఇంకా అవసరం. సినిమా మొత్తం హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో వదలనే సాంగ్ లీడ్ సీన్ చాలా బాగుంటుంది. అలాగే సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మెమొరబుల్‌గా ఉంటాయి. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌లో అనేక లేయర్స్ ఉంటాయి. హీరోకు సమానంగా డైరెక్టర్ నా పాత్రను చిత్రీకరించారు. మీరు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన నాలుగు పాటలు చూస్తే నాలుగు పాటల్లో ఒక్కోలా కనిపిస్తాను. అన్నీ వేరేషన్స్ నా పాత్రలో ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story