కమలా నెహ్రూ ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

by Batti.Sumithra |

పేషెంట్లతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.

కమలా నెహ్రూ ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
X

దిశ, నాగార్జునసాగర్ : పేషెంట్లతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ప్రభుత్వాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆరోగ్య మిత్ర కౌంటర్‌ను పరిశీలించిన కలెక్టర్, అక్కడ సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరారు. చికిత్స కోసం వచ్చిన పేషెంట్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో సీటు వచ్చిన తమ కుమార్తెకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చామని ఒక కుటుంబం తెలిపింది. మరో మహిళ తనకు షుగర్ స్థాయి 350 ఉండటంతో చికిత్స కోసం వచ్చానని చెప్పగా, ఆమెకు ధైర్యం చెప్పిన కలెక్టర్, డ్యూటీ వైద్యుడిని పిలిచి సరైన డైట్ ప్లాన్ వివరించి చికిత్స అందించాలని సూచించారు.

Next Story