టీఆర్ఎస్ తుంగతుర్తి నియోజవర్గ ఇంచార్జిగా కృష్ణవేణి

by Batti.Sumithra |

తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ తుంగతుర్తి నియోజవర్గ ఇంచార్జిగా సూరారపు కృష్ణవేణి నియమితులయ్యారు.

టీఆర్ఎస్ తుంగతుర్తి నియోజవర్గ ఇంచార్జిగా కృష్ణవేణి
X

దిశ, తుంగతుర్తి : తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ తుంగతుర్తి నియోజవర్గ ఇంచార్జిగా సూరారపు కృష్ణవేణి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత బుధవారం అధికారికంగా ప్రకటించి నియామక పత్రం అందజేశారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా కృష్ణ వేణికి టిఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజవర్గ ఇంచార్జిగా ప్రకటించడం పట్ల పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. నూతనకల్ మండలానికి చెందిన కృష్ణవేణి మొదటి నుంచి కల్వకుంట్ల కవిత వెంట కొనసాగుతున్నారు.కాగా బుధవారం రాత్రి ఆమె "దిశ"తో మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ఇంచార్జి నియమించడం పట్ల ఆమె పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అధినేత్రి కవిత ఇన్చార్జిలను ప్రకటించారు. అందులో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.

Next Story