- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో 5 గురుకి జీవిత జీవిత ఖైదు...
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

దిశ, మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించడంతో పాటు ఒక్కో నిందితుడికి రూ.20 వేల జరిమానా విధించింది. బాధిత మైనర్ బాలికకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. కేసు వివరాల ప్రకారం.. 2020 అక్టోబర్‌లో మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై లోకిని రాజేష్, దారంగుల సాయికుమార్, మొగిలిపాక అనిల్‌కుమార్, కుంచెపు శివ, కుంచెపు వెంకటేష్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అప్పటి ఎస్సై సదాకర్ కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీలు గౌస్‌బాబా, రవీంద్రరెడ్డి సమగ్ర దర్యాప్తు చేపట్టి పటిష్టమైన ఆధారాలతో ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు బలమైన వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రత్న పద్మావతి ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు. అదనంగా ఒక్కో నిందితుడికి రూ.20 వేల జరిమానా విధించి, బాధితురాలికి మొత్తం రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు, విద్యార్థినులు తమపై జరిగే వేధింపులు, నేరాలపై నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరం చేసిన ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు, దర్యాప్తు అధికారులు గౌస్‌బాబా, రవీంద్రరెడ్డి, అప్పటి ఎస్సై సదాకర్, సీఐఎంఎస్ ఎస్సై శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ రంజిత్, సీఐఎంఎస్ కానిస్టేబుళ్లు కిరణ్‌కుమార్, శ్రీధర్, రాజు తదితరులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






