- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి పినపాక ఎమ్మెల్యే విజ్ఞప్తి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీఎస్), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు మంత్రి దామోదర రాజనర్సింహని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు.

దిశ, మణుగూరు : పినపాక నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీఎస్), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, వైద్య పరికరాలు, నిధులను అత్యవసరంగా మంజూరు చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని బుధవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు. పినపాక నియోజకవర్గం గిరిజన, అటవీ, గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన ప్రత్యేక నియోజకవర్గమని, వేలాది మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడి వైద్య సేవలు పొందుతున్నారని ఆయన తెలిపారు. అయితే వైద్యులు, నిపుణులైన స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరతతో పాటు పలు ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో మణుగూరు వంద పడకల ఏరియా ఆసుపత్రి, బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్ సి), మణుగూరు, గుండాల, కరకగూడెం, మొరంపల్లి బంజర, ఆళ్లపల్లి, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను మంత్రికి అందజేశారు. ఈ ప్రతిపాదనల్లో వైద్యులు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీ, ఐసీయూ, చిన్నారుల వార్డు, ఓపీ షెడ్, బయోమెడికల్ గదులు, అదనపు పడకలు, అంబులెన్స్, మార్చురీ వాహనం, వైద్య పరికరాల ఏర్పాటు, సబ్ సెంటర్ల భవనాలు, కాంపౌండ్ వాల్స్, పెండింగ్‌లో ఉన్న హెచ్‌డీఎస్ నిధుల విడుదల, అవసరమైన చోట పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేయడం వంటి అంశాలను చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సమర్పించిన ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేసి అన్ని ఆసుపత్రులను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే పాయం మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఇందుకు మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ప్రతిపాదనలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.






