24 గంటల్లోనే హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్

by Taduka Kalyani |

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయిపల్లి గ్రామంలో వృద్ధుడు కాంపల్లి హనుమయ్య హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

24 గంటల్లోనే హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్
X

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయిపల్లి గ్రామంలో వృద్ధుడు కాంపల్లి హనుమయ్య హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్య అనంతరం పరారైన నిందితుడిని బుధవారం దొంగలమరి చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల సందర్భంగా అరెస్ట్ చేశారు. సీఐ ఎం. రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన నిందితుడు పోలీసులను గమనించి బైక్‌పై వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సీఐ ఎం. రాజ్‌కుమార్ అభినందించారు. ఈ కేసు దర్యాప్తు, నిందితుడి అరెస్టులో కొడిమ్యాల ఎస్‌ఐ ఎ. నరేశ్‌కుమార్, మల్యాల ఎస్‌ఐ ఎస్. సందీప్‌తో పాటు పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు సీఐ తెలిపారు.

Next Story