- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Patna High Court: సల్వార్ తొలగించడం, ఛాతిని ప్రెస్ చేయడం మాత్రమే అత్యాచార యత్నం కాదు
2008లో బీహార్‌లోని బంకా జిల్లాలో నమోదైన కేసులో ట్రయల్ కోర్టు విధించిన అత్యాచార యత్నం, అక్రమ నిర్బంధం శిక్షలను జస్టిస్ పూర్ణేందు సింగ్ రద్దు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: అత్యాచార యత్నం కేసుల్లో ఎలాంటి చర్యలను చట్టపరంగా 'రేప్ అటెంప్ట్'గా పరిగణించాలి అనే అంశంపై పాట్నా హైకోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళ సల్వార్‌ను తొలగించే ప్రయత్నం చేయడం, ఆమె ఛాతీని నొక్కడం వంటి చర్యలు మాత్రమే అత్యాచార యత్నం నేరాన్ని నిరూపించడానికి సరిపోవని స్పష్టం చేసింది. పెనెట్రేషన్ లేదా రేప్‌కు పాల్పడే ప్రయత్నం చేసినట్టు స్పష్టమైన ఆధారాలుండాలని పేర్కొంది. 2008లో బీహార్‌లోని బంకా జిల్లాలో నమోదైన కేసులో ట్రయల్ కోర్టు విధించిన అత్యాచార యత్నం, అక్రమ నిర్బంధం శిక్షలను జస్టిస్ పూర్ణేందు సింగ్ రద్దు చేశారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులతో సహా పలువురు సాక్షులు ఉన్నప్పటికీ, దర్యాప్తు అధికారిని విచారించకపోవడం, వైద్య ఆధారాలు సమర్పించకపోవడం వంటి లోపాలను కూడా హైకోర్టు ప్రస్తావించింది.
అయితే, ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలను పూర్తిగా అంగీకరించినా, మహిళను గదిలో బంధించడం, తలుపు మూసివేయడం, సల్వార్‌ను తొలగించే ప్రయత్నం చేయడం, ఛాతీని నొక్కడం వంటి చర్యలు మహిళ గౌరవానికి భంగం కలిగించే నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 354 పరిధిలోకి రావచ్చని హైకోర్టు పేర్కొంది. కానీ, అవి మాత్రమే ఐపీసీ సెక్షన్లు 376/511 కింద అత్యాచార యత్నాన్ని నిరూపించడానికి సరిపోవని స్పష్టం చేసింది. కేసు వివరాలకు సంబంధించి.. ఫోటో తీయించుకునేందుకు వెళ్లిన యువతిని సదరు స్టూడియో యజమాని, ఆమె తండ్రిని బయటే ఉంచి, యువతిని బంధించి సల్వార్ తొలగించి ఛాతీపై నొక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి అరుపులతో నిందితుడు పారిపోగా, ఈ ఘటనపై దాఖలైన అత్యాచార యత్నం కేసును ట్రయల్ కోర్టు విచారించి శిక్ష విధించింది. అయితే, లైంగిక యత్నానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు గానీ, మెడికల్ రిపోర్టు గానీ లేకపోవడంతో హైకోర్టు అతడిని ఆ కేసు నుండి నిర్దోషిగా విడుదల చేసింది.






