ఇరాన్‌పై అమెరికా ముమ్మర దాడులు.. వ్యూహాత్మక సైనిక స్థావరాలే లక్ష్యం!

by Ramesh Naini |

హర్మూజ్‌ జలసంధి పరిధిలోని ఇరాన్ తీరప్రాంత సైనిక స్థావరాలపై అమెరికా దళాలు మరోసారి భీకర దాడులు జరిపినట్లు సమాచారం.

ఇరాన్‌పై అమెరికా ముమ్మర దాడులు.. వ్యూహాత్మక సైనిక స్థావరాలే లక్ష్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్మూజ్‌ జలసంధి పరిధిలోని ఇరాన్ తీరప్రాంత సైనిక స్థావరాలపై అమెరికా దళాలు మరోసారి భీకర దాడులు జరిపినట్లు సమాచారం. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులు చేసేందుకు ఇరాన్ ఉపయోగిస్తున్న సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ పగటిపూట దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) బుధవారం ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. హర్మూజ్ జలసంధిలో నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval blockade) అమలు చేస్తామని అమెరికా హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది.

90 నిమిషాల పాటు దాడుల పర్వం..

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 గంటల వరకు (సుమారు 90 నిమిషాల పాటు) ఈ దాడుల పర్వం కొనసాగింది. గ్రేటర్ టుంబ్ ద్వీపంలోని ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలు, క్రూయిజ్ క్షిపణి నిల్వ కేంద్రాలు, ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం ఖచ్చితమైన వ్యూహాత్మక దాడులు (Precision munitions) చేసింది. కాగా, ఈ దాడుల వల్ల ఇరాన్‌కు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, అమెరికా చేసిన ఈ తాజా దాడులపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన లేదా ప్రకటన విడుదల చేయలేదు.

Next Story