అభివృద్ధి దిశగా పాల్వంచకు మరో అడుగు

by Batti.Sumithra |

పాల్వంచ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

అభివృద్ధి దిశగా పాల్వంచకు మరో అడుగు
X

దిశ, పాల్వంచ టౌన్ : పాల్వంచ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచలో రూ.1.73 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 10 అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 31, 33, 34, 36, 38, 42, 45 డివిజన్లలో సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

పనుల అమలులో నాణ్యతా ప్రమాణాల పై రాజీ పడొద్దని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపక్ష ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, పాల్వంచ రూపురేఖలను మార్చే దిశగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ కె. సుజాత, తహసీల్దార్ దారా ప్రసాద్, కార్పొరేటర్లు, సీపీఐ నాయకులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story