Hyderabad: 20 రోజుల పాటు వైశాలీనగర్ అండర్‌పాస్ బంద్.. ప్రత్యామ్నాయ మార్గాలివే!

by Ramesh Naini |

ట్రాఫిక్ రద్దీ, భారీ వర్షాలకు నీరు నిలిచిపోయే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సైబరాబాద్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్‌ వద్ద అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు.

Hyderabad: 20 రోజుల పాటు వైశాలీనగర్ అండర్‌పాస్ బంద్.. ప్రత్యామ్నాయ మార్గాలివే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ రద్దీ, భారీ వర్షాలకు నీరు నిలిచిపోయే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సైబరాబాద్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్‌ వద్ద అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు విస్తరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల నిమిత్తం జూలై 16 నుంచి 20 రోజుల పాటు ఈ అండర్‌పాస్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. అండర్‌పాస్ మూసివేత కారణంగా వాహనదారుల సౌకర్యార్థం ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు ఇవే..

హఫీజ్‌పేట్ వైపు వెళ్లేవారికి.. మై హోమ్ మంగళా, తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ వైపు నుంచి వచ్చే వాహనాలు రాఘవేంద్ర నగర్ కాలనీ, హైటెన్షన్ రోడ్, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం మీదుగా హఫీజ్‌పేట్ ఆర్ఓబీ (ROB) ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలి. మై హోమ్ మంగళా వైపు వెళ్లేవారికి.. హఫీజ్‌పేట్, ఆర్టీసీ కాలనీ, మై హోమ్ జువెల్, వాసవి లేక్ సిటీ, గోపాల్‌నగర్, కాల్వరీ టెంపుల్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పైప్‌లైన్ రోడ్ మీదుగా హఫీజ్‌పేట్ ఆర్ఓబీకి చేరుకుని, జెన్‌పాక్ట్ జంక్షన్ వద్ద ఎడమ మలుపు తిరిగి కొండాపూర్-ఆల్విన్ రోడ్ ద్వారా ప్రయాణించాలి. ఈ అభివృద్ధి పనుల కారణంగా వాహనదారులకు కలిగే తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తున్నామని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story