- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IBM Crash: ఐబీఎం చరిత్రలోనే అతిపెద్ద పతనం
త్రైమాసికంలో తమ వ్యాపార అంచనాలు తప్పాయని కంపెనీ అంగీకరించడంతో.. మంగళవారం నాడు ఐబీఎం షేర్లు పడిపోయాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం వాల్ స్ట్రీట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పతనాన్ని చవిచూసింది. ఒక్క రోజులో కంపెనీ షేర్ ధర దాదాపు 25 శాతం క్షీణించడంతో కొన్ని గంటల వ్యవధిలో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 70 బిలియన్ డాలర్ల (మన కరెన్సీలో రూ.6.74లక్షల కోట్ల)కు పైగా సంపద ఆవిరైంది. గత 58 ఏళ్లలోనే ఐబీఎం కంపెనీ షేరు విలువ ఒక్క రోజులో ఇంత దారుణంగా పతనం కావడం ఇదే తొలిసారి. త్రైమాసికంలో తమ వ్యాపార అంచనాలు తప్పాయని కంపెనీ అంగీకరించడంతో.. మంగళవారం నాడు ఐబీఎం షేర్లు పడిపోయాయి. ఇది 1987 నాటి చారిత్రాత్మక గ్లోబల్ మార్కెట్ క్రాష్ (బ్లాక్ మండే) కంటే పెద్ద పతనం కావడం గమనార్హం. ఈ స్థాయి నష్టాలకు ప్రధాన కారణం త్రైమాసిక ఫలితాలఓ పాటు కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు కూడా ప్రభావితం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఐటీ బడ్జెట్లను ఖర్చు చేసే విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పూర్తిగా మార్చేశాయి. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీలన్నీ సాధారణ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను కొనడం ఆపేసి.. భవిష్యత్తులో కొరత ఏర్పడుతుందనే భయంతో ఏఐకి అవసరమైన సర్వర్లు, మెమరీ చిప్‌లు, స్టోరేజ్ వంటి హార్డ్‌వేర్ మౌలిక సదుపాయాలను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. కస్టమర్ల బడ్జెట్ ఇంత వేగంగా హార్డ్‌వేర్ వైపు మళ్లుతుందని తాము ఊహించలేకపోయామని, కొన్ని పెద్ద ఒప్పందాలు పూర్తి చేయడంలో విఫలమయ్యామని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ పెట్టుబడిదారులతో బహిరంగంగానే ఒప్పుకున్నారు.






