- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?
సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ సోనీ లీవ్ సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: మలయాళ స్టార్ టొవినో థామస్, కాయదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, విజయ్ రాఘవన్, సుధీర్ కరమన్, వినోద్ కేదమంగళం, శత్రు బాబురాజ్ కీలక పాత్రలో కనిపించారు. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ సోనీ లీవ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే జూలై 24 నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1950-60 మధ్య కాలంలో కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా అద్భుతంగా రూపొందించారు.
1957లో కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ మరుసటి సంవత్సరమే అంటే 1958లో ప్రభుత్వం చారిత్రాత్మకమైన 'భూ సంస్కరణల బిల్లు'ను అమల్లోకి తెస్తుంది. ఈ బిల్లు కారణంగా గ్రామాల్లో ఉండే భూస్వాములు, వలసదారుల నుంచి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత మొదలవుతుంది. ఈ గొడవల నేపథ్యంలో తమ చర్చిలను, ఆస్తులను కాపాడుకునేందుకు మత పెద్దలు ప్రత్యేక రక్షణ దళాలను తయారు చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే పోతన్ క్రిస్టోఫర్ అనే యువకుడిని చర్చి రక్షకుడిగా నియమిస్తారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. చర్చి రక్షకుడిగా మారిన అతని అసలు పేరు కృష్ణ పిళ్లై. అసలు ఒక హిందూ యువకుడైన కృష్ణ పిళ్లై, మారుపేరుతో చర్చిలోకి ఎందుకు అడుగుపెట్టాడు? తన అసలు గుర్తింపును ఎందుకు దాచాల్సి వచ్చింది? మరోవైపు తీవ్రమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న రెబెక్కాతో అతని ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు చర్చి గొడవల్లో అతను ఎలాంటి పాత్ర పోషించాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.






