- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముద్రగడ అంత్యక్రియల్లో వివాదం.. స్పందించిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడి ఇంటి ఆవరణం ప్రాంగణంలోనే ముగిశాయి. అయితే ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు....

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడి ఇంటి ఆవరణం ప్రాంగణంలోనే ముగిశాయి. అయితే ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు. కానీ కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో సాధారణ పద్ధతిలోనే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు కాపు నేతలు, వైసీపీ నాయకులు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ముద్రగడకు ఘన నివాళులర్పించారు. అయితే ముద్రగడ అధికార లాంఛనాల వివాదంపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ప్రభుత్వ లాంఛనాలు వద్దని కుటుంబ సభ్యులు ఎక్కడా చెప్పలేదన్నారు. తాను రాలేనని, తమరు వెళ్లి నివాళల్పించాలని పవన్ కల్యాణ్ చెప్పారని బొలిశెట్టి తెలిపారు. పవన్ కల్యాణ్ కు జరిగిన సర్జరీ వల్ల ముద్రగడ అంత్యక్రియలకు రాలేదకపోయారన్నారు. పార్టీలు వేరైనా ముద్రగడ పద్మనాభాన్ని అన్నలా చూశామని చెప్పారు. ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ సూచించారని బొలిశెట్టి తెలిపారు.






