మిల్లర్ల సమస్య పరిష్కారానికి కృషి చేయాలి

by Taduka Kalyani |

జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా పోలీస్ శాఖ సహకరించాలని, మిల్లర్ల యజమానులపై కేసులు నమోదు చేయవద్దని జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు.

మిల్లర్ల సమస్య పరిష్కారానికి కృషి చేయాలి
X

దిశ,ములుగు జిల్లా ప్రతినిధి : జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా పోలీస్ శాఖ సహకరించాలని, మిల్లర్ల యజమానులపై కేసులు నమోదు చేయవద్దని జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు. బుధవారం అసోసియేషన్ ఆధ్వర్యంలోని నాయకులు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. 2025-26 రబి సీజన్లో జిల్లాలోని మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యాన్ని తీసుకోవడం జరిగిందని, ఆ సమయంలో పోలీస్ ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షణ చేస్తూ బలవంతంగా ధాన్యాన్ని దిగుమతి చేయడం జరిగిందని వివరించారు. మిల్లులో తయారైన బియ్యాన్ని ప్రభుత్వం తీసుకోకపోవడంతో సమయం గడుస్తున్న కొద్దీ ధాన్యంలో నాణ్యత లోపించి డిష్ కలర్ డామేజ్ అధికమైపోతూ దాన్యంలో బరువు తగ్గిపోతున్నదని తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల భవిష్యత్తులో మిల్లర్లు నష్టపోయి ప్రభుత్వానికి బాకీ పడితే అలాంటి సమయంలో తమపై ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ సానుకూలంగా స్పందించి మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెల్లి హరినాథ్ పాల్గొన్నారు.

Next Story