పల్లె ప్రకృతి వనం ఫెన్సింగ్ మాయం..!

by Taduka Kalyani |   (  Updated:2026-07-15 10:31:01  IST  )

మండలంలోని మల్లూరు గ్రామంలోని పల్లె ప్రకృతి వనానికి ఉన్న సుమారు లక్షా యాభై వేల ఫెన్సింగ్ జాలి అపహరణకు గురైంది.

పల్లె ప్రకృతి వనం ఫెన్సింగ్ మాయం..!
X

దిశ, మంగపేట : మండలంలోని మల్లూరు గ్రామంలోని పల్లె ప్రకృతి వనానికి ఉన్న సుమారు లక్షా యాభై వేల ఫెన్సింగ్ జాలి అపహరణకు గురైంది. గ్రామంలోని రామాలయం వీధి లక్ష్మీనృసింహస్వామి విశ్రాంతి మండపం సమీపంలో గ్రామంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. చెట్లు నాటిన నుండి ఏపుగా పెరిగే వరకు వాటి సంరక్షణ కోసం చుట్టూ లక్షా యాబైవేలతో ఫెన్సింగ్ జాలి ఏర్పాటు చేసిన అధికారులు దాని పర్యవేక్షణ లేకపోవడంతో ఇంటి దొంగల సహాకారంతో గ్రామంలోని కొందరు వ్యక్తులు మంగళవారం పెన్సింగ్ దొంగిలించినట్లు గుస గుసలు వినపడుతున్నాయి. ఇటీవల గ్రామపంచాయతీకి కార్యదర్శుల బదిలీలు కావడంతో అధికారులు లేని సమయంలో అక్రమార్కులు చేతివాటం చూపించినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఇంటి దొంగల సహాకారంతో పల్లె ప్రకృతి వనం పెన్షింగ్ దొంగిలించిన దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషమయై పంచాయతీ కార్యదర్శి యాదవరాజును వివరణ కోరగా పల్లె ప్రకృతి వనం పెన్సింగ్ దొంగిలించినట్లు సిబ్బందితో సమాచారం అందిందని ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసు అంటించినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Next Story