జర్నలిస్టుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి.. ఐఅండ్‌పీఆర్ కార్యాలయం ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ భారీ నిరసన

by Ramesh Naini |   (  Updated:2026-07-15 10:26:45  IST  )

జర్నలిస్టుల సమస్యల సాధన కోసం కలం కదం తొక్కింది. తమ దీర్ఘకాలిక సమస్యలను, న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఇవాళ (బుదవారం) హైదరాబాద్‌లోని సమాచార, పౌరసంబంధాల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

జర్నలిస్టుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి.. ఐఅండ్‌పీఆర్ కార్యాలయం ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ భారీ నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో : జర్నలిస్టుల సమస్యల సాధన కోసం కలం కదం తొక్కింది. తమ దీర్ఘకాలిక సమస్యలను, న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఇవాళ (బుధవారం) హైదరాబాద్‌లోని సమాచార, పౌరసంబంధాల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు దశలవారీగా ఆందోళనలు చేపట్టామని వారు గుర్తుచేశారు. ఇన్ని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ కనీస స్పందన రాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులను సమీకరించి, పెద్ద ఎత్తున ఈ ఆందోళనకు దిగినట్లు వారు స్పష్టం చేశారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం ఇకనైనా సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన డిమాండ్లు ఇవే..

ఎలాంటి కోటాలతో సంబంధం లేకుండా, అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి. జర్నలిస్టులకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు కూడా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులతో పాటు, హైదరాబాద్ మెట్రో రైళ్లలోనూ జర్నలిస్టులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి.

Next Story