- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడో పెళ్లిపై లవ్ జిహాద్ విమర్శలు.. స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆమిర్ ఖాన్
తన ఇద్దరు సోదరిమణులు హిందువులను పెళ్లి చేసుకున్నారని, తన కూతురు కూడా ఒక హిందూ అబ్బాయినే వివాహం చేసుకుందని గుర్తు చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, ఇటీవల గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం. జూలై 5న ముంబైలో వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. అయితే, ఈ పెళ్లి తర్వాత అమీర్ ఖాన్‌ను లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేయడం ప్రారంభించారు. తాజాగా, ఈ విషయంపై ఆమిర్ ఖాన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న ఈ లవ్ జిహాద్ కామెంట్లలో ఎలాంటి నిజం లేదని అమీర్ ఖాన్ కొట్టిపారేశారు. తన కుటుంబంలో ఎప్పటి నుంచో భిన్న మతాల వివాహాలు జరుగుతున్నాయని, తమది చాలా ఓపెన్ మైండ్ ఉన్న సమ్మిళిత కుటుంబమని చెప్పారు. తన ఇద్దరు సోదరిమణులు హిందువులను పెళ్లి చేసుకున్నారని, తన కూతురు కూడా ఒక హిందూ అబ్బాయినే వివాహం చేసుకుందని గుర్తు చేశారు.
అలాగే తన కజిన్ మన్సూర్ ఒక క్రిస్టియన్‌ను పెళ్లాడాడని చెప్పారు. తన జీవితంలో జరిగిన పెళ్లిళ్లలో ఎప్పుడూ మతం మార్పిడి అనేదే జరగలేదని అమీర్ స్పష్టం చేశారు. ఇప్పుడు చేసుకున్న గౌరీ స్ప్రెట్ గానీ, గతంలో వివాహం చేసుకున్న కిరణ్ రావు, రీనా దత్తా గానీ.. వీరెవరూ తన కోసం మతం మార్చుకోలేదని, తమవన్నీ చట్టబద్ధంగా జరిగిన రిజిస్టర్ పెళ్లిళ్లు అని వివరించారు. పైగా తన మూడో భార్య గౌరీ హిందువు కూడా కాదని, ఆమె ఒక క్రిస్టియన్ అని, అది కూడా ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాదని క్లారిటీ ఇచ్చారు. రోజులు గడుస్తున్న కొద్దీ కొందరి ప్రవర్తన చూస్తుంటే జీవితం మరింత వింతగా, కామెడీగా మారుతోందంటూ అమీర్ ఖాన్ ఈ వివాదంపై ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే, అమీర్ ఖాన్, గౌరీ స్ప్రెట్ పెళ్లికి సంబంధించిన ఫస్ట్ డాన్స్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.






