- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనాలోచిత నిర్ణయాలు.. నిరుపయోగంగా నిర్మాణాలు
ఖమ్మంలో అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది.

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మంలో అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. అప్పట్లో అధికారంలో ఉన్నవారు కూడా తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు సహకరించడంతో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు పలు దృష్టాంతాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి.
50 లక్షల వ్యయంతో నిర్మించినా..
ఖమ్మం నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని రోటరీ నగర్ లో వీధి వ్యాపారుల కోసం ఒక ప్రాంగణాన్ని నిర్మించారు. ఈ నిర్మాణం కోసం ఏకంగా 50 లక్షలు రూపాయలు ఖర్చు చేశారు. రోటరీ నగర్ రద్దీ ప్రాంతం కావడంతో కూరగాయల వ్యాపారాలు బాగా సాగుతాయని అధికారులు భావించారు. వీధి వ్యాపారుల ప్రాంగణంలో వ్యాపారస్తులకు దుకాణాలు కేటాయించారు. ఇక్కడ ఉత్సాహంగా వ్యాపారం ప్రారంభించిన వ్యాపారులు తర్వాత కొనుగోళ్లు మందగించడంతో ఒక్కొక్కరుగా తమ దుకాణాలను మూసివేశారు. వీధి వ్యాపారులు అందరు వెళ్లిపోవడంతో 50 లక్షలు ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రాంగణం ప్రస్తుతం ఖాళీగా ఉంది. లక్షల రూపాయలు వృధా అయ్యాయి. ఖాళీగా ఉన్న ఈ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.
రూ. 4.50 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం...
ఖమ్మం నగరంలోని వీడివోస్ కాలనీలో సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ ఆధునిక మార్కెట్ ని నిర్మించారు. ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్ నడవక మూత పడింది. ఈ పరిస్థితిని చూసినప్పటికీ ఇల్లందు రోడ్ లో ఖానాపురం సమీపంలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలు వ్యయంతో మరో సమీకృత ఆధునిక మార్కెట్ నిర్మాణం చేపట్టారు. కొంత నిర్మాణం పూర్తి చేసిన తర్వాత నిధులు ఇంకా ఎక్కువ కావాలని నిర్మాణాన్ని ఆఫ్ చేశారు. అది అలాగే ఉంది. ఇలా అనాలోచిత చర్యలతో ప్రజాధనం వృధా అవుతున్నది.






