మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యల పై కాంగ్రెస్ నిరసన

by Batti.Sumithra |   (  Updated:2026-07-15 12:08:58  IST  )

ఎన్నికల్లో ఓటమిపాలైన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మతిభ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొక్క బిక్షపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యల పై కాంగ్రెస్ నిరసన
X

దిశ, నడిగూడెం : ఎన్నికల్లో ఓటమిపాలైన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మతిభ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొక్క బిక్షపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

అనంతరం మల్లయ్య యాదవ్‌ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, పేదలు, మధ్యతరగతి ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కోదాడ–హుజూర్‌నగర్ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇక పై ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రస్తుత, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story