మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

by Batti.Sumithra |

భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ మహిళా కళాశాలలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ మహిళా కళాశాలలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 న ఉదయం 9 గంటల లోపు కళాశాలకు చేరుకోవాలని, ప్రస్తుతం ఎస్సీ అభ్యర్థులకు అన్ని గ్రూపుల్లో, ఎస్టీ అభ్యర్థులకు ఎంపీసీలో -1, బీకామ్ జనరల్‌లో -2, మైనారిటీ అభ్యర్థులకు బీజెడ్సీలో -1 సీటు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.

అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు స్క్రీనింగ్‌కు హాజరై ప్రవేశావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థి కనీసం ఎత్తు 152 సెంటీమీటర్లు కంటే ఎక్కువగా ఉండాలని,+1.5 కంటే తక్కువ కంటిచూపు లోపం కలిగి ఉండాలని తెలిపారు. అలాగే 2026 జనవరి 1 లేదా ఆ తర్వాత జారీ చేసిన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, చదువు, ప్రవర్తన ధృవీకరణ పత్రాలు, 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, మాజీ సైనికుల ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, సంబంధిత పత్రాల రెండు ఫోటో కాపీలను తమ వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. అన్ని స్క్రీనింగ్ పరీక్షల్లో అర్హత సాధించి, ఖాళీ సీట్ల లభ్యత ఉన్న అభ్యర్థులకే ప్రవేశం కల్పిస్తారని స్పష్టం చేశారు.

Next Story