సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. తల్లి విజయలక్ష్మిని ప్రశ్నించిన హైకోర్టు

by Vemula.Srinu Prasad |

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ ఘటనపై సీబీఐ దర్యాప్తు పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు విచారణ చేపట్టింది. ...

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. తల్లి విజయలక్ష్మిని ప్రశ్నించిన హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు(Saikrishna custodial death case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ ఘటనపై సీబీఐ(CBI) దర్యాప్తు పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు విచారణ చేపట్టింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి(Saikrishna mother Vijayalakshmi) కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని విజయలక్ష్మిని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన కారణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాలను సమర్పించాలని కోర్టు సూచించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

సీబీఐ దర్యాప్తు కోరిన విజయలక్ష్మి

కాగా సాయికృష్ణ లాకప్ డెట్ నేపథ్యంలో గతంలో విజయలక్ష్మి సీబీఐ దర్యాప్తును కోరారు. అంతేకాదు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ధర్మాసనం విచారణ కొనసాగించింది. అయితే అనూహ్యంగా సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకోవాలంటూ విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘అప్పుడు ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరారు.. ఇప్పుడెందుకు ఉపసంహరించుకుంటున్నారు.’ అనేకోణంలో విజయలక్ష్మిని కోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. ఈ మేరకు కేసు విచారణను వాయిదా వేసింది.

Next Story