- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణుడు కరుణించక కర్షకుడికి కన్నీటి కష్టం
వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అన్నదాతలకు వర్షాభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

దిశ, మామడ : వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అన్నదాతలకు వర్షాభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విత్తనాలు వేసి నెలరోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మొలకెత్తిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామడ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు మొక్కజొన్న, పత్తి, పసుపు తదితర పంటలను సాగు చేశారు. అయితే వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు వాడిపోయే దశకు చేరుకున్నాయని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.
పంటలను కాపాడేందుకు బోర్ల ద్వారా నీటిని అందించాలనుకున్నా, భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోర్లలో కూడా నీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పంటలను రక్షించుకునే అవకాశం లేక నిస్సహాయ స్థితిలో ఉన్నామని అంటున్నారు. ఎండల తీవ్రత కారణంగా మొలకెత్తిన మొక్కలు, వరి నారు భూమిలోనే ఎండిపోతుండటంతో రైతుల కష్టం వృథా అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసి పంటలు గట్టెక్కాలని అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు.






