- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CBSE ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం.. సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
CBSE ప్రవేశపెట్టిన డిజిటల్ మూల్యాంకన విధానం (OSM) లోని లోపాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అమలు చేస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో లోపాలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా రియాక్ట్ అయింది. డిజిటల్ ఎవల్యూషన్‌తో మార్కులు పూర్తిగా తగ్గిపోవడం, సాంకేతిక లోపాల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనపై సుప్రీం ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఆన్-స్క్రీన్ డిజిటల్ ఎవల్యూషన్ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ జరిపిన కోర్టు.. విద్యార్థుల ఆవేదనను కూడా కేంద్ర ప్రభుత్వం, బోర్డు తీవ్రంగా పరిగణించాలని సూచించింది.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు..
కాగా, కోర్టు విచారణ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ డిజిటల్ విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు, అవసరం అయిన సంస్కరణలను చేపట్టేందుకు ఇప్పటికే ఎస్.రాధా చౌహాన్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కోర్టుకు వెల్లడించారు. ఈ కమిటీ విద్యార్థుల ఫిర్యాదులను, సాంకేతిక సమస్యలను పరిశీలిస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే పిటిషనర్ కలుగజేసుకుని సాంకేతిక లోపాల వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, డిజిటల్ మూల్యాంకనానికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ముఖ్యంగా మార్కులు తగ్గడం వల్ల ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు తగిన సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇదే అంశంపై చేపట్టిన చర్యల వివరాలతో సమగ్ర నివేదిక (Status Report) సమర్పించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.






