దిశ ఎఫెక్ట్.. ఆదివాసీలకు అటవీ సంరక్షణ పై అవగాహన సదస్సు

by Batti.Sumithra |

పర్యావరణ పరిరక్షణ, అడవుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ముసలమడుగు సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనార్కలి పేర్కొన్నారు.

దిశ ఎఫెక్ట్.. ఆదివాసీలకు అటవీ సంరక్షణ పై అవగాహన సదస్సు
X

దిశ, ​బూర్గంపాడు : పర్యావరణ పరిరక్షణ, అడవుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ముసలమడుగు సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనార్కలి పేర్కొన్నారు. సోంపల్లి ఫారెస్ట్ లో మంగళవారం గిరిజనులు ఫారెస్టులో పోడు కొట్టిన నేపథ్యంలో గ్రామంలో పాల్వంచ రేంజ్, ముసలమడుగు సెక్షన్, సోంపల్లి బీట్ అటవీ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం ఆదివాసీలకు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ, పోడు సాగు పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ​ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే అటవీ హక్కు పత్రాలు లేని భూముల పై ఎలాంటి పోడు సాగు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దుక్కులు దున్నడం, పంటలు వేయడం వంటి చర్యలకు పాల్పడకూడదని సూచించారు. చట్టవిరుద్ధంగా అడవులను నరికినా, ప్రభుత్వ ప్లాంటేషన్లను ధ్వంసం చేసి పోడు సాగుకు ప్రయత్నించినా అటవీ చట్టాలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ​

అలాగే, కొత్తగా అడవులను ఆక్రమించి పోడు భూములను సృష్టించవద్దని, అడవులకు నిప్పు పెట్టడం లేదా వన్యప్రాణులను వేటాడడం వంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. అటవీ సంపదను కాపాడుకుని భావితరాలకు అందించడం ప్రతి పౌరుడి కనీస బాధ్యతని వివరించారు. అడవుల్లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించినా వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించి, అటవీ శాఖకు సహకరించాలని గ్రామస్థులను కోరారు. ​ఈ అవగాహన కార్యక్రమంలో సోంపల్లి మాజీ సర్పంచ్ తాటి వీరాంజనేయులు, సోంపల్లి పంచాయతీ గ్రామ సెక్రెటరీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే అటవీ శాఖ తరఫున సోంపల్లి బీట్ ఆఫీసర్ సోడె శ్రీరాములు, ముసలిమడుగు ఈస్ట్ బీట్ ఆఫీసర్ మడకం వీరేందర్, ముసలమడుగు వెస్ట్ బీట్ ఆఫీసర్ బానవత్ సురేష్, చెరువు సింగారం బీట్ ఆఫీసర్ భూక్య పద్మ, నకిరిపేట బీట్ ఆఫీసర్ దొడ్డ పెద్ద రామ్మూర్తి, చెరువు సింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానొత్ నవీన్‌, ముసలిమడుగు నార్త్ బీట్ ఆఫీసర్ మూడ్ ఝాన్సీలతో పాటు స్థానిక గ్రామస్తులు మడకం నాగమణి, కారం బంగారమ్మ, బొర్ర సుభద్ర, బొర్ర పిచ్చమ్మ, బొర్ర ఆదిలక్ష్మి, బొర్ర రాములమ్మ, బొర్ర సీత, బొర్ర పొట్టెమ్మ, బొర్ర రాజమ్మ, మీడియం రామలక్ష్మి, మీడియం సరోజిని, కనితి జిప్పమ్మ, కారం సుజాత, సోడె జగదీష్, సోడె సావిత్రి, బుడ్డగూడెం గ్రామ యువతీ యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Next Story