ముద్రగడకు వైఎస్ జగన్ నివాళి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-15 10:03:47  IST  )

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన భౌతికకాయాన్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు..

ముద్రగడకు వైఎస్ జగన్ నివాళి
X

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Kapu movement leader Mudragada Padmanabham) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన భౌతికకాయానికి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) నివాళులర్పించారు. హైదరాబాద్ ఆస్పత్రిలో చనిపోయిన ముద్రగడ మృతదేహాన్ని కాకినాడ జిల్లా కిర్లంపూడి(Kakinada District Kirlampudi) నివాసానికి తరలించారు. అయితే ముద్రగడను చివరిసారి చేసేందుకు కాపునేతలు, వైసీపీ నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కాపులకు ముద్రగడ చేసిన సేవలను గుర్తు తెచ్చుంటూ కన్నీటి నివాళులర్పించారు. భారీ జనగణం మధ్య మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీతో పాటు తామూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Next Story