- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువు గండిని అత్యవసరంగా పూడ్చాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం–రుద్రారం, ముల్కల కాల్వ, రాయినిపాలెం, జాలుబాయి తండా గ్రామాల మధ్య ఉన్న చెరువుకు గండి పడటంతో చెరువులోని నీరు భారీగా వృథాగా వెళ్లిపోతోంది.

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం–రుద్రారం, ముల్కల కాల్వ, రాయినిపాలెం, జాలుబాయి తండా గ్రామాల మధ్య ఉన్న చెరువుకు గండి పడటంతో చెరువులోని నీరు భారీగా వృథాగా వెళ్లిపోతోంది. దీంతో రైతులకు సాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని సమాచారం అందుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) బుధవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుకు పడిన గండిని అత్యవసర ప్రాతిపదికన పూడ్చి, చెరువులోని నీరు వృథాగా పోకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా లక్ష్మీపురం–రుద్రారం చెరువు వద్ద శాశ్వత పరిష్కారంగా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాన్ని మంజూరు చేసి, నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






