నాటుసారా కేంద్రం పై పోలీసుల దాడి..

by Batti.Sumithra |   (  Updated:2026-07-15 09:15:47  IST  )

గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తే కేసు నమోదు చేసి వాహనాలు సిజ్ చేస్తామని ఎక్సైజ్ ఎస్సై జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

నాటుసారా కేంద్రం పై పోలీసుల దాడి..
X

దిశ, హుజూర్ నగర్ టౌన్ : గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తే కేసు నమోదు చేసి వాహనాలు సిజ్ చేస్తామని ఎక్సైజ్ ఎస్సై జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం హుజూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా తన టీవీఎస్ వాహనం పై సారాను తరలిస్తుండగా పట్టుకొని వాహనం ను సీజ్ చేసి 3 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తి పై కేసునమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ వ్యక్తి కి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకంను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. ఈ దాడులలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు గురువయ్య, గోపి రెడ్డి, డ్రైవర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story