- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాల్వంచలో రోడ్డు ప్రమాదాలకు చెక్..
పాల్వంచ మండలంలోని పెద్దమ్మ గుడి సమీపంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

దిశ, పాల్వంచ రూరల్ : పాల్వంచ మండలంలోని పెద్దమ్మ గుడి సమీపంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణలో భాగంగా పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో బ్లూ కోర్ట్ సిబ్బందితో కలిసి దెబ్బతిన్న రోడ్డు డివైడర్లకు మరమ్మత్తులు చేపట్టారు. పెద్దమ్మ గుడి వద్ద నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, ప్రధాన రహదారి పై డివైడర్లు అనేక చోట్ల దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు తప్పుదారిలో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రిఫ్లెక్టర్లు లేకపోవడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న డివైడర్లను మరమ్మత్తు చేయడంతో పాటు కొత్త రిఫ్లెక్టర్లు, హెచ్చరిక సైన్‌బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పాల్వంచ రూరల్ ఎస్సై మాట్లాడుతూ ఈ రహదారి పై ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డివైడర్లను మరమ్మత్తు చేస్తున్నాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. స్థానికులు, పెద్దమ్మ గుడికి వచ్చే భక్తులు పోలీసుల ఈ చర్యలను అభినందించారు.






