- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొప్ప గౌరవంగా భావిస్తున్నా.. ఆ ముగ్గురితో నటించడం కల నిజమైనట్లుగా అనిపిస్తుంది: సయామీ ఖేర్
సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్ లాంటిదని సయామీ పేర్కొన్నారు.

దిశ, సినిమా: అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హైవాన్’. ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో అక్షయ్ కుమార్ ఒక అంధుడైన మార్షల్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించనుండగా.. మలయాళం సూపర్ హిట్ అయిన ‘ఒప్పం’ సినిమాకు రీమేక్‌గా రాబోతుంది. సైకోపాత్ కిల్లర్ నుంచి ఓ చిన్నారిని రక్షించే నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని టాక్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం ఇక ఇందులో సైయామీ ఖేర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న థియేటర్స్‌లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. సైయామీ ఈ మూవీ ఫస్ట్ కట్ చూసి ఆనందాన్ని పంచుకున్నారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్ లాంటిదని సయామీ పేర్కొన్నారు.
సినిమా నిర్మాణంలో ప్రతి అడుగు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని, అయితే డబ్బింగ్ చెప్పే సమయంలోనే సినిమా ఎలా వచ్చిందో అంతా ఒకే దగ్గర పూర్తి రూపంలో కనిపిస్తుందని చెప్పారు. అది నిజంగా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ప్రియదర్శన్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు సయామీ చెప్పారు. తన కల నిజమైనట్లుగా అనిపిస్తుందని అన్నారు. దర్శకుడిగా ప్రియదర్శన్‌కు ఇది 99వ సినిమా కావడం వల్లే ఈ ప్రాజెక్ట్ తనకు మరింత స్పెషల్‌గా మారిందని చెప్పారు. ఆయన కథలు చెప్పే విధానం ఎన్నో తరాల వారికి స్ఫూర్తినిచ్చిందని ప్రశంసించారు. ఆయన ఆలోచనలు, విజన్ స్క్రీన్ మీద ఎలా ప్రాణం పోసుకున్నాయో దగ్గరుండి చూడటం తనకు ఒక అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని వివరించారు. సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత, దీనిని ప్రేక్షకులు థియేటర్లలో ఎప్పుడు చూస్తారా అనే ఉత్సాహం తనలో మరింత పెరిగిందని సయామీ ఖేర్ వెల్లడించారు.






