- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 23 పంచాయతీలకు ISO గుర్తింపు.. కమిషనర్ అభినందనలు
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో 23 పంచాయతీలకు ISO గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ సిబ్బందిని అభినందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 23 పంచాయతీలకు ISO గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ సిబ్బందిని అభినందించారు. పంచాయతీల పాలనలో పారదర్శకత, నాణ్యమైన సేవలకు గుర్తింపు దక్కిందన్నారు. మెరుగైన రికార్డుల నిర్వహణ, త్వరితగతిన ధృవపత్రాల జారీకి గుర్తింపు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు లభించిన ఈ ఐఎస్‌వో సర్టిఫికేషన్, భవిష్యత్తులో మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఒక గొప్ప ప్రోత్సాహకరంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖను కేరళ తరహాలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు కమిషనర్ కృష్ణతేజ ఈ సందర్భంగా వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పాలనను మరింత పటిష్టం చేసి, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.
Next Story






