కంటైనర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

by Batti.Sumithra |

ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ గాయపడగా, ప్రయాణికులు సేఫ్ గా బయటపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ 44వ హైవే పై బుధవారం చోటు చేసుకుంది.

కంటైనర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
X

దిశ, భిక్కనూరు : ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ గాయపడగా, ప్రయాణికులు సేఫ్ గా బయటపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ 44వ హైవే పై బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి డిపోకు చెందిన లగ్జరీ ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు ప్రయాణికులతో జేబీఎస్ వెళ్తోంది. జంగంపల్లి సాయిబాబా టెంపుల్ సమీపంలో ముందుగా వెళుతున్న కంటైనర్ వాహన డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బస్సు డ్రైవర్ బాలయ్య గాయపడగా, బస్సులో ఉన్న ప్రయాణికులు మాత్రం ఎటువంటి దెబ్బలు తగలకుండా సేఫ్ గా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బాలయ్యను జీఎంఆర్ అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హైవేపై ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకున్నారు.

Next Story