- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌకధర దుకాణంలో నాసిరకం సన్నబియ్యం..!
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని చౌకధర దుకాణాల్లో జూలై నెలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉండటంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, ములుగు : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని చౌకధర దుకాణాల్లో జూలై నెలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉండటంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యంలో పురుగులు, ముక్క బియ్యం, ఎలుకల మలం, తొట్టెలు, ఇతర చెత్తాచెదారం ఉండటంతో వినియోగానికి పనికిరాని స్థితిలో ఉందని ఆరోపిస్తున్నారు.మండల కేంద్రంలోని రెండు చౌకధర దుకాణాల పరిధిలో సుమారు 1,120 రేషన్ కార్డులు ఉండగా, ప్రతి నెల సుమారు 2040 క్వింటాళ్ల సన్నబియ్యం పంపిణీ అవుతోంది. అయితే ఈ నెల సరఫరా చేసిన బియ్యం నాణ్యత లేకపోవడంతో పలువురు లబ్ధిదారులు బియ్యాన్ని తీసుకెళ్లేందుకే నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో పురుగులు పట్టిన, కలుషితమైన బియ్యాన్ని వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బియ్యం సంచులపై నిజామాబాద్‌కు సంబంధించిన స్టిక్కర్లు ఉండటంతో పాటు, 2022–23 సంవత్సరానికి చెందిన పాత నిల్వలనే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ బియ్యాన్ని వెనక్కి తీసుకుని నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
డీలర్ స్పందన..
ఈ విషయంపై రేషన్ డీలర్ పద్మ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యంలోనే పురుగులు, చెత్తాచెదారం ఉండటంతో లబ్ధిదారులు బియ్యం తీసుకునేందుకు నిరాసక్తత చూపుతున్నారని తెలిపారు. దీంతో ప్రజల ఆగ్రహం తమపై కూడా వ్యక్తమవుతోందన్నారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రజలకు నాణ్యమైన బియ్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.






