- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తుల వేలం వివాదం కేసు : సుప్రీంకోర్టుకు నిర్మాత బండ్ల గణేష్
ఆస్తివేలం వివాదం కేసులో ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బకాయిలను చెల్లించినా తన ఆస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టు మెట్లెక్కారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆస్తివేలం వివాదం కేసులో ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బకాయిలను చెల్లించినా తన ఆస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టు మెట్లెక్కారు. హైదరాబాద్ కు చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ కు యూనియన్ బ్యాంక్ అందించిన రుణాలకు.. బండ్ల గణేష్ ఫ్యామిలీ తమ సొంత ఆస్తుల్ని పూచీకత్తుగా తాకట్టు పెట్టింది. అయితే.. సదరు కార్పొరేట్ రివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా.. బ్యాంక్ లో వారు తాకట్టు పెట్టిన ఆస్తిని SARFAESI చట్టం కింద వేసింది. దీనిని సవాలు చేస్తూ బండ్ల గణేష్ డెబ్ట్స్ రికరవీ ట్రిబ్యునల్ (DRT-II)ను ఆశ్రయించగా.. ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
బ్యాంక్ వేలం ప్రక్రియ చెల్లదని పేర్కొన్న DRT.. తిరిగి ఆ ఆస్తిని యజమానులకు అప్పగించాలని, కొనుగోలుదారులకు వారి సొమ్మును వడ్డీతో సహా రిటర్న్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ తర్పును సదరు బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. బ్యాంక్ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ.. బ్యాంక్ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో బండ్ల గణేష్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద కోర్టు రూ.129 కోట్లు వసూలు చేసిందని, బకాయిలు తీరాక కూడా ఆస్తుల్ని వేలం వేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుపై అత్యున్నత ధర్మాసనం త్వరలోనే విచారణ చేపట్టనుంది.






