అభివృద్ధి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

by Kodari Anjali |

వరంగల్ నగర అభివృద్ధికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

అభివృద్ధి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: వరంగల్ నగర అభివృద్ధికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మామునూరు విమానాశ్రయాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2, 2028 వరకు పూర్తి చేసేలా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాలు ఒప్పించిన సందర్భంగా హనుమకొండ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు. వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య , హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, టీపీసీసీ, డీసీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Next Story