- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కష్టాలు నాకు తెలుసు.. మీకు నేనున్నా: వైఎస్ జగన్
రాష్ట్రంలో ఆక్వా రంగంసమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోందని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former Minsiter Jagan Mohan Reddy) అన్నారు. ఆక్వా రైతులు, రైతు ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆక్వా రంగం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోందని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former Minsiter Jagan Mohan Reddy) అన్నారు. ఆక్వా రైతులు, రైతు ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. అక్వా రైతులు దీనావస్థలో ఉన్నా ప్రభుత్వానికి ‘దున్నపోతు మీద వాన పడినట్టు’ ఉందని జగన్ మండిపడ్డారు. దాదాపు ఐదు లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జగన్ ఆరోపించారు.
సిండికేట్‌గా చంద్రబాబు నాయుడి సానుభూతిపరులు
సీఎం చంద్రబాబు నాయుడి సానుభూతిపరులే సిండికేట్‌గా ఏర్పడి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ సిండికేట్ చేతుల్లో ఆక్వా రైతులు నలిగిపోతున్నారని, ఫీడ్, సీడ్ ధరలను వారే ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. ఫీడ్ ధరలను కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు పెంచేసి, కేవలం రూ.2 తగ్గించి చేతులు దులుపుకోవడం రైతులను అవమానించడమేనన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఇలాంటి సిండికేట్‌లకే పండగ అని, రైతన్నలకు మాత్రం కన్నీరే మిగులుతుందని జగన్ ఎద్దేవా చేశారు.
మా హయాంలో ‘అప్సడా’ ఏర్పాటు చేశాం
ఆక్వా రైతులకు అండగా ఉండేందుకు తమ హయాంలో ‘అప్సడా’ (APSADA)ను ఏర్పాటు చేశామని జగన్ గుర్తు చేశారు. తద్వారా సీడ్, ఫీడ్, మార్కెటింగ్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించామని ఆయన చెప్పారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రైతుల కోసం 35 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్‌లను నియమించామని ఆయన తెలిపారు. నరసాపురంలో తాము తీసుకొచ్చిన ఫిషరీస్ వర్సిటీని, భీమవరంలో మెడికల్ కాలేజీ పనులను సైతం చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిందని జగన్ ఆరోపించారు.
ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు
ఆక్వా రైతుల కష్టాలు తనకు తెలుసని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరఫున ఉద్యమబాట పడతామని ఆయన స్పష్టం చేశారు. మరో మూడేళ్లలో మళ్లీ రైతు ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు సిండికేట్‌ను కూకటివేళ్లతో పీకేస్తామని హెచ్చరించారు. మళ్లీ ‘అప్సడా’కు పూర్వ వైభవం తీసుకువస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.






