దుర్గం చెరువులోకి మురుగునీటి ప్రవాహాన్ని అరికట్టాలి

by Ratna Kumari |

దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.

దుర్గం చెరువులోకి మురుగునీటి ప్రవాహాన్ని అరికట్టాలి
X

దిశ, శేరిలింగంపల్లి : దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జలమండలి ఉన్నతాధికారులతో కలిసి దుర్గం చెరువు ఎస్టీపీ ఇంటర్‌సెప్షన్ అండ్ డైవర్షన్ వ్యవస్థను ఆమె పరిశీలించారు. చెరువులోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న మళ్లింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా చెరువులోకి మురుగునీటిని చేరవేస్తున్న వెంట్లను రేపటిలోగా మూసివేయాలని, సోమవారం నాటికి మురుగునీటి ప్రవాహాన్ని పూర్తిగా ఎస్టీపీకి మళ్లించాలని అధికారులను ఆదేశించారు.

ఇంటర్‌సెప్షన్ అండ్ డైవర్షన్ వ్యవస్థ నిర్మాణ ప్రాంతంలో ఏరేటర్లను ఏర్పాటు చేయాలని రహేజా సంస్థకు సూచించారు. అలాగే ఎస్‌ఎన్‌డీపీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనుల సమయంలో సీవర్ లైన్‌ను పునరుద్ధరించి, భవిష్యత్తులో మురుగునీరు చెరువులోకి చేరకుండా శాశ్వత మళ్లింపు పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీ-హబ్ లేఅవుట్ ప్రాంతం నుంచి వస్తున్న మురుగునీటి ప్రవాహాన్ని కూడా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను కమిషనర్ సృజన ఆదేశించారు. వచ్చే సోమవారం మరోసారి దుర్గం చెరువును సందర్శించి, చేపట్టిన పనుల పురోగతిని స్వయంగా సమీక్షిస్తానని ఆమె తెలిపారు.

Next Story