అద్దె వాహనాల బకాయిలు చెల్లించాలి..

by Batti.Sumithra |

పెట్రోలు, డిజిటల్ ధరలు పెరిగినందున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలకు వినియోగించే అద్దె వాహనాలకు చెల్లించే అద్దెలను పెంచాలని అద్దె వాహన యజమానుల అసోసియేషన్ అధ్యక్షులు చింతలచెరువు పవన్ అన్నారు.

అద్దె వాహనాల బకాయిలు చెల్లించాలి..
X

దిశ, సూర్యాపేట : పెట్రోలు, డిజిటల్ ధరలు పెరిగినందున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలకు వినియోగించే అద్దె వాహనాలకు చెల్లించే అద్దెలను పెంచాలని అద్దె వాహన యజమానుల అసోసియేషన్ అధ్యక్షులు చింతలచెరువు పవన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అద్దె కారులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పెట్రోలు ధర లీటరు 54/- వున్నప్పుడు అద్దె వాహనాలకు నెలకు 3,3000/- చెల్లించే వారని, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరు 106/- వున్నందున అద్దె వాహనాలకు నెలకు 55000/- చెలించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో అద్దె వాహనాల డ్రైవర్ లకు రెస్ట్ రూం సౌకర్యం కల్పించాలని, కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని అన్నారు.

వివిధ విభాగాల నుండి అద్దె వాహనాలకు గత పది నెలల నుంచి కిరాయిలు చెల్లించడం లేదని, అద్దె వాహనాలకు బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ కు ప్రజావాణిలో తమ‌ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. కాబట్టి తమకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని, తాము డ్రైవర్ లకు వేతనాలు, పెట్రోల్ ఖర్చులు స్వంతంగా చెల్లించవలసి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ వెంకన్న, కోశాధికారి తన్నీరు మహేష్, సభ్యులు రహీం, సాయికుమార్, హరీష్, సందీప్, ప్రదీప్, జీవన్, కృష్ణ, గోవర్దన్, శ్రీకాంత్, సిద్దార్ద, మధు, షరీఫ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story