- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క హిట్‌తో మారిన భాగ్యశ్రీ బోర్సే రేంజ్.. బాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరో సరసన చాన్స్!
ఈ సినిమాలో ఆమె బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ సరసన జోడీగా నటించనున్నట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయాయి. ఈ భామ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ.. ఇటీవల అక్కినేని అఖిల్ సరసన నటించిన ‘లెనిన్’ మూవీతో ఆమె కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ ఒక్క సినిమా విజయంతో అమ్మడి రేంజ్, క్రేజ్ పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు చిత్ర పరిశ్రమలో టాక్ . ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మిలాప్ జవేరి దర్శకత్వంలో రాబోతున్న ఒక భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ సరసన జోడీగా నటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ క్రేజీ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు, పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో భాగ్యశ్రీ హిందీ ఇండస్ట్రీలో కూడా తన జెండా పాతేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు, భాగ్యశ్రీ బోర్సే కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టి బిజీగా గడుపుతున్నారు. తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్ సరసన ‘సెయాన్’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను లెజెండరీ నటుడు కమల్ హాసన్, మహేంద్రన్ కలిసి 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఒక్క హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు.






