"ఢిల్లీ వాళ్ళ వల్లే కాలేదు.. గల్లీల్లో ఆపే దమ్ముందా?".. జగన్ సభలో మరోసారి ఫ్లెక్సీల కలకలం

by Muthe.Rajitha |

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం నిర్వహించిన YSRCP అధినేత వైఎస్ జగన్ "ఆక్వా రైతుల ముఖాముఖి" బహిరంగ సభలో మరోసారి ఫ్లెక్సీల కలకలం రేపుతోంది.

ఢిల్లీ వాళ్ళ వల్లే కాలేదు.. గల్లీల్లో ఆపే దమ్ముందా?.. జగన్ సభలో మరోసారి ఫ్లెక్సీల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "ఆక్వా రైతుల ముఖాముఖి" బహిరంగ సభ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సభా ప్రాంగణంతో పాటు భీమవరం పరిసర ప్రాంతాలలో వైస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కొన్ని పొలిటికల్ ఫ్లెక్సీలు మరోసారి ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై "ఢిల్లీ వాళ్ళ వల్లే కాలేదు.. గల్లీల్లో జగన్ ను ఆపే దమ్ముందా?", "ఆ కుర్చీ పుట్టిందే ఆ కుటుంబం కోసం" అంటూ ముద్రించిన స్లోగన్ స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలోనే తమ నాయకుడిని ఎవరూ అడ్డుకోలేకపోయారని, అలాంటిది ఇక్కడి స్థానిక గల్లీ రాజకీయాల్లో తమను ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? అనే అర్థం వచ్చేలా ఈ బ్యానర్లు వెలిశాయి.

ఈ నినాదం ప్రత్యక్షంగా ప్రస్తుత రాష్ట్ర పాలకులను, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో బలమైన పట్టున్న తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిని టార్గెట్ చేస్తూ సవాల్ విసిరినట్లుగా ఉండటంతో ఇరువర్గాల మధ్య రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ప్రధానంగా గోదావరి డెల్టా ప్రాంతంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం, పెరిగిన మేత ధరలు, విద్యుత్ రాయితీల కోత, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. అయితే, రైతుల సమస్యల కంటే ఈ సభ చుట్టూ వెలిసిన రాజకీయ నినాదాలు, ఫ్లెక్సీలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

Next Story