ది రాజాసాబ్ నుంచి మ‌రో అప్డేట్‌..గూస్ బంప్స్ రావాల్సిందే

by velandi.Saikiran |   (  Updated:2026-01-05 06:37:03  IST  )

బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి తరహాలో ది రాజా సాబ్ పోస్టర్ ను చిత్ర బృందం వదిలింది. ఇందులో ప్రభాస్ రాముడి తరహాలో బాణం వేస్తూ కనిపించాడు. ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

ది రాజాసాబ్ నుంచి మ‌రో అప్డేట్‌..గూస్ బంప్స్ రావాల్సిందే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్, కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి.

మొదటిది పెద్దగా పేలకపోయినా, రెండో ట్రైలర్ మాత్రం అందరిని ఆకట్టుకుంది. దీంతో సంక్రాంతి బరిలో ఉన్న ది రాజా సాబ్ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ది రాజా సాబ్ నుంచి మరో పోస్టర్ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి తరహాలో ది రాజా సాబ్ పోస్టర్ ను చిత్ర బృందం వదిలింది. ఇందులో ప్రభాస్ రాముడి తరహాలో బాణం వేస్తూ కనిపించాడు. ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

Read More..

ఇది AI కాదు అంటూ ప్రభాస్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన నిధి.. ఆందోళనలో ఫ్యాన్స్

Next Story