- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది AI కాదు అంటూ ప్రభాస్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన నిధి.. ఆందోళనలో ఫ్యాన్స్
‘సవ్యసాచి’(Savya Sachi) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘సవ్యసాచి’(Savya Sachi) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) మనందరికీ సుపరిచితమే. ఇక రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాతో మన ముందుకు వచ్చిన ఈ చిన్నది ప్రజెంట్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’(Raja Saab) మూవీలో నటిస్తోంది.
దీనికి మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తుండగా.. ఆమెతో పాటు రిద్ధి కుమార్(Ridhi Kumar), మాళవిక మోహనన్(Malavika Mohanan) కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. దీంతో
ఇక ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతుంది. ఈ క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నిధి తన సోషల్ మీడియా(Social Media)లో ప్రభాస్‌తో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఇది ఏఐ కాదు అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్, నెటిజన్లు ప్రభాస్ ఏంటి ఇలా అయిపోయాడు, అతని కళ్ళకు ఏమైంది ఏమైనా హెల్త్ ఇష్యూనా అంటూ ఆందోళన చెందుతున్నారు. కాగా నిధి షేర్ చేసిన ఫొటోలో ప్రభాస్ ఫేస్ కొంచెం చిక్కిపోయి డిఫరెంట్‌గా కనిపించాడు.
Read More..
అలాంటి మహిళలే నిజమైన అందగత్తె.. అనసూయ సెన్సేషనల్ పోస్ట్!






