ఆమెతో హోలీ సెలబ్రేట్ చేసుకున్న యంగ్ హీరో.. బెస్ట్ కపుల్ అంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-15 05:42:08  IST  )

యాంకర్‌గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’(30 Rojullo Preminchadam Ela) అని మొదటి సినిమాతో మెప్పించి ఇప్పుడు తన రెండో సినిమాతో రాబోతున్నాడు.

ఆమెతో హోలీ సెలబ్రేట్ చేసుకున్న యంగ్ హీరో.. బెస్ట్ కపుల్ అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్‌గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’(30 Rojullo Preminchadam Ela) అని మొదటి సినిమాతో మెప్పించి ఇప్పుడు తన రెండో సినిమాతో రాబోతున్నాడు. ప్రదీప్ మాచిరాజు, జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbai). ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్‌(Bharath)లు తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ప్రదీప్, దీపికాకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. బేసిక్‌గా ముందుగా మనకు హూలీ(Holi) అంటే గుర్తుకు వచ్చేది రంగు(Colours) పూసుకోవడం. నిన్న ఈ పండుగ సందర్భంగా దాదాపు అందరూ సెలబ్రిటీలు రంగులు పూసుకుని ఆ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారే ఉన్నారు.

ఈ నేపథ్యంలో యంగ్ హీరో ప్రదీప్ కూడా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే అతను సెలబ్రేట్ చేసుకున్నది మాత్రం దీపిక పిల్లితో. అందుకు సంబంధించిన వీడియోను ఆ హీరో ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్ చేశారు. ఇక ఈ వీడియోకు ‘రంగుల వినోదం లోడ్ అవుతోంది.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టీమ్ నుండి హోలీ శుభాకాంక్షలు.. త్వరలో విడుదల తేదీ ప్రకటన’ అని రాసుకొచ్చాడు. అందులో వీరిద్దరూ చూడముచ్చటగా హోలీ ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు బెస్ట్ కపుల్‌లా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

ఆ అమ్మాయి బుగ్గలపై గట్టిగా ముద్దిచ్చిన ప్రభాస్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు


Next Story