- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వారణాసి’ వీఎఫ్ఎక్స్ అదిరిపోవడం పక్కా.. దానికి ఈ ఒక్క కారణమే చాలు
రాజమౌళి సొంతగా వీఎఫ్ఎక్స్ స్టూడియోను నిర్మించినట్లు, అందులోనే వారణాసి చిత్రానికి సంబంధించిన సింహభాగం గ్రాఫిక్స్ పనులు జరగనున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ సినిమా హిస్టరీలో వీఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలను తెరకెక్కించడంలో నిష్ణాతుడైన దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి మొదటి వరుసలో ఉంటారు. ఈయన 2012లోనే ఈగ లాంటి అద్భుతమైన గ్రాఫిక్స్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత జక్కన్న రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలలో కూడా భారీ వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉండగా, వాటిని తెరకెక్కించిన విధానానికి ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా భారీ స్కేల్‌లో ‘వారణాసి’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ సినిమాలో కూడా అత్యంత భారీ వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి అనగానే ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని, కచ్చితంగా సినిమాలోని గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయని ప్రేక్షకులు ఇప్పటికే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని గ్రాఫిక్స్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోవని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇప్పటివరకు వేర్వేరు గ్రాఫిక్స్ కంపెనీలకు అవుట్‌పుట్ ఇచ్చి వాటిని దగ్గరుండి మెరుగుపరుచుకునే రాజమౌళి, ఈసారి ఏకంగా సొంతంగా వీఎఫ్ఎక్స్ స్టూడియోనే ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయి సాంకేతికత ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన ప్రధాన గ్రాఫిక్స్ పనులు ఈ సంస్థలోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సొంతంగా ఏర్పాటు చేసిన సంస్థతో పాటు మరో నాలుగైదు అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం పని చేయనున్నట్లు సమాచారం. ఇలా తాను నిర్మించుకున్న వీఎఫ్ఎక్స్ స్టూడియోలోనే ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన సింహభాగం గ్రాఫిక్స్ పనులు జరగనున్నట్లు వార్తలు రావడంతో, ఈ సినిమా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉండబోతుందని ప్రేక్షకులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు.






