అడవి శేష్ చేతిలో అన్ని సినిమాలు.. ఎవరితో ఉన్నాయో తెలుసా?

by Pulgam srinivas |   (  Updated:2026-04-06 13:21:06  IST  )

అడవి శేష్ ‘డెకాయిట్’, ‘గూడచారి 2’తో పాటు మరో మూడు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తుంది.

అడవి శేష్ చేతిలో అన్ని సినిమాలు.. ఎవరితో ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటుల్లో అడవి శేష్ ఒకరు. శేష్ హీరోగా నటించిన దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, ఈయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెలుగు సినిమా పరిశ్రమలో ఏర్పడింది. తాజాగా ఈ నటుడు డెకాయిట్ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంతో పాటు శేష్ మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ యంగ్ హీరో గూడచారి 2 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అదేవిధంగా లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే రాజేష్ దండా నిర్మాణంలో ఒక సినిమాను, తన స్నేహితుడితో మరో చిత్రాన్ని చేయడానికి కూడా ఈయన ఒప్పుకున్నట్లు సమాచారం. అడవి శేష్ సాధారణంగా ఒక సినిమాను పూర్తి చేయడం కోసమే చాలా సమయాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇన్ని సినిమాలకు కమిట్ కావడంతో, ఈ చిత్రాలన్నీ ఎప్పుడు పూర్తవుతాయా అనే ఆసక్తి ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.

‘వారణాసి’ వీఎఫ్ఎక్స్ అదిరిపోవడం పక్కా.. దానికి ఈ ఒక్క కారణమే చాలు

Next Story