అదిరిపోనున్న సమ్మర్.. ఆ ముగ్గురి ఫ్యాన్స్ ఖుషి కావాల్సిందే

by Pulgam srinivas |   (  Updated:2026-03-21 09:56:49  IST  )

అదిరిపోనున్న సమ్మర్... రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు రానున్నాయి.

అదిరిపోనున్న సమ్మర్.. ఆ ముగ్గురి ఫ్యాన్స్ ఖుషి కావాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాల నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వారి అభిమానులు ఎంతగానో ఆనందపడుతుంటారు. అలాంటి ఆనందాన్ని ఈ సమ్మర్‌లో ముగ్గురు స్టార్ హీరోలు తమ అభిమానులకు పంచబోతున్నారు. మన టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ సినిమాలకు సంబంధించిన అదిరిపోయే రేంజ్ అప్డేట్లు ఈ వేసవిలో రానున్నట్లు సమాచారం.

పెద్ది

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది ’ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో ఒకటి, రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం.

AA22 X A6

అల్లు అర్జున్ - అట్లీ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న AA22 X A6 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

NTRNeel

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న NTRNeel చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మే 20న విడుదల చేయనున్నట్లు సమాచారం.

‘ధురంధర్ 2’ భారతీయ సినిమాకు రీసెట్ బటన్.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Next Story