- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధురంధర్ 2’ భారతీయ సినిమాకు రీసెట్ బటన్.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్ 2’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టెక్నికల్ వాల్యూస్, మేకింగ్ స్టైల్‌లో కొత్తదనాన్ని ఇష్టపడే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma), తాజాగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా మేకింగ్ చూస్తుంటే ఇండియన్ సినిమా మేకింగ్ స్టైల్ మారబోతోందని, ఈ చిత్రం ఓ రీసెట్ బటన్ అని పేర్కొన్నారు.
‘ధురంధర్ 2’ చిత్రం భారతీయ సినిమాకు కొత్త దిశను చూపిస్తుందని, పాత పద్ధతులను తుడిచిపెట్టి కొత్త ఒరవడిని సృష్టిస్తుందని వర్మ అభిప్రాయపడ్డారు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి భారీ విజయం తర్వాత ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన విజన్, టెక్నికల్ నాలెడ్జ్ అద్భుతమని ఆర్జీవీ ప్రశంసించారు. ఈ సినిమాను కేవలం మరో యాక్షన్ సినిమాగా చూడటం మూర్ఖత్వం అవుతుందని, ఇది టెక్నాలజీ పరంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.






