- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దురంధర్ 2 ఒక మాస్టర్ పీస్ : రాజమౌళి ప్రశంసలు
దురంధర్ 2 సినిమాపై దర్శకుడు రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 4 గంటలు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చో పెట్టాలంటే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా విడుదలైన 'ధురంధర్: ద రివెంజ్' చిత్రంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సినిమా చూసిన అనంతరం ఆయన చిత్ర బృందాన్ని అభినందించారు.
స్కేల్ అండ్ సోల్ అద్భుతం
"నాకు ధురంధర్-1 అంటే చాలా ఇష్టం, కానీ 'ద రివెంజ్' మాత్రం స్కేల్ పరంగానూ, సోల్ పరంగానూ మొదటి భాగాన్ని మించిపోయింది" అని రాజమౌళి పేర్కొన్నారు. సినిమాలోని రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక పనితీరు, సంగీతం, దర్శకత్వం అన్నీ అత్యున్నత ప్రమాణాలతో ఉన్నాయని ఆయన ప్రశంసించారు. దర్శకుడు ఆదిత్య ధర్ గురించి చెబుతూ.. "ఏకంగా 4 గంటల నిడివి ఉన్న సినిమాను తీసి విడుదల చేయాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి. కానీ ప్రేక్షకులు చివరి ఫ్రేమ్ వరకు సీటుకే అతుక్కుపోయేలా చేయడంలో మీరు సఫలమయ్యారు. ఆదిత్య ధర్.. మీరు ఈ సినిమాతో సిక్సర్ కొట్టారు" అని అభినందించారు.
ఇక నటీనటుల నటన గురించి రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "రణవీర్.. ఏమా పర్ఫార్మెన్స్ అది! ఆ షెడ్‌లో చెల్లెలితో వచ్చే సీన్ నటనకు ఒక మాస్టర్ క్లాస్. హంజా, జస్కీరత్ పాత్రల్లో మమ్మల్ని మంత్రముగ్ధులను చేశారు" అని పేర్కొన్నారు. "ఒక దేశం ఎదుర్కొంటున్న నిస్సహాయతను, అసహనాన్ని మాధవన్ తన నటనలో అద్భుతంగా పండించారు. స్క్రీన్‌పై ఆయన విజయాన్ని మా సొంత విజయంగా భావించాం." అని జక్కన్న తెలిపారు. సినిమాలోని ఎమోషనల్ పాయింట్స్, అదిరిపోయే ప్లాట్ ట్విస్ట్‌లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని రాజమౌళి తన పోస్టులో చెప్పుకొచ్చారు.






