- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధురంధర్ 2 చేసిన మిస్టేక్ 'ఉస్తాద్'కి బాగా కలిసి వచ్చింది
ధురంధర్ 2 మూవీ యూనిట్ చేసిన మిస్టేక్ వల్ల రెండు రోజులు 'ఉస్తాద్ భగత్ సింగ్'కు కలిసి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రం రెండవ భాగంపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మొదటి భాగం కేవలం హిందీలో మాత్రమే విడుదలయ్యింది, కానీ రెండవ భాగాన్ని మార్చ్ 19న హిందీతో పాటు చాలా భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా తెలుగు వర్షన్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూడటం మొదలుపెట్టారు.
ఈ సినిమా తెలుగు వర్షన్ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ కావడంతో చాలామంది వాటిని బుక్ చేసుకున్నారు. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కూడా అదే తేదీన విడుదల కావడానికి సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్ వల్ల పవన్ చిత్రానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చాలామంది అంచనా వేశారు. ఇక విడుదల తేదీ రానే వచ్చింది. ఓవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల అయింది, కానీ ధురంధర్ తెలుగు వర్షన్ మాత్రం అందుబాటులో లేదు. చాలామంది టికెట్లు రద్దు అయ్యి డబ్బులు వాపసు అయ్యాయి.
థియేటర్ యాజమాన్యాలు కూడా తెలుగు వర్షన్ ఈరోజు ప్రదర్శించడం లేదని చెప్పాయి. అలా రెండు రోజులపాటు జరిగింది. ఈ రోజు నుండి ధురంధర్ 2 తెలుగు వర్షన్ థియేటర్లలో ప్రదర్శించబడనుంది. 'ధురంధర్: ది రివెంజ్'కి మొదటి షోకే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, కానీ పవన్ సినిమాకు మాత్రం గొప్ప టాక్ రాలేదు. దాంతో ధురంధర్: ది రివెంజ్ తెలుగు వర్షన్ గనుక మార్చ్ 19 నుండి అందుబాటులో ఉండి ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ఆ రెండు రోజులు కూడా కలెక్షన్లు తగ్గేవి, ఆ మూవీ యూనిట్ చేసిన తప్పు ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.






