ఆ స్టార్ నిర్మాత చేతికి అర్జున్ 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు

by Pulgam srinivas |   (  Updated:2026-05-23 06:47:56  IST  )

అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకుంది.

ఆ స్టార్ నిర్మాత చేతికి అర్జున్ బ్లాస్ట్ జోన్ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు
X

దిశ, వెబ్ డెస్క్: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బ్లాస్ట్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు భాషల్లో మే 28వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర బృందం వెల్లడించింది. ‘బ్లాస్ట్ జోన్’ చిత్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకున్నట్లు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థకు మంచి మార్కెట్, బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉండటంతో సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దక్కే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదేవిధంగా సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంటే కలెక్షన్ల పరంగా కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అభిరామి కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు సుభాష్ రాజ్ ఈ సినిమాను తెరకెక్కించగా, రవి బస్రూర్ సంగీతం అందించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘రౌడీ జనార్ధన్’పై బిగ్ అప్‌డేట్.. ఒక్కరు కాదు ఇద్దరు ఎంట్రీ

Next Story