‘రౌడీ జనార్ధన్’పై బిగ్ అప్‌డేట్.. ఒక్కరు కాదు ఇద్దరు ఎంట్రీ

by Pulgam srinivas |   (  Updated:2026-05-23 06:48:43  IST  )

‘రౌడీ జనార్ధన’ చిత్రానికి విశాల్ మిశ్రా, క్రిస్టో జేవియర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం.

‘రౌడీ జనార్ధన్’పై బిగ్ అప్‌డేట్.. ఒక్కరు కాదు ఇద్దరు ఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్ధన’ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం ఏకంగా ఇద్దరు క్రేజీ సంగీత దర్శకులు పని చేయనున్నట్లు సమాచారం.

పాటలకు ‘యానిమల్’, ‘టాక్సిక్’ చిత్రాలకు సంగీతం అందించిన విశాల్ మిశ్రా మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను ‘భ్రమయుగం’ ఫేమ్ క్రిస్టో జేవియర్ చేపట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా ఇద్దరు సూపర్ టాలెంటెడ్ సంగీత దర్శకులు ఒకే సినిమా కోసం పని చేయనున్నారనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ‘రౌడీ జనార్ధన’ సినిమాపై అభిమానుల్లో, సినీ లవర్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ స్టార్ నిర్మాత చేతికి అర్జున్ 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు

Next Story